- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు.. జగన్‌ది రాక్షస పాలన: Devineni Uma Maheswara Rao
దిశ, డైనమిక్ బ్యూరో : స్వాతంత్య్రం కోసం ఆనాడు మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం చేస్తే నేడు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో ఇసుక సత్యాగ్రహం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇసుకపై కొత్త పాలసీ తీసుకువస్తానని సీఎం వైఎస్ జగన్ చెప్పడంతో ప్రజలంతా నమ్మారని చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు మైనింగ్ డిపార్ట్మెంట్‌ను అడ్డంపెట్టి రెండు సంవత్సరాలు ఇసుక దోపిడి చేసి డబ్బులు అన్ని తాడేపల్లి ప్యాలెస్‌కు కప్పం కట్టారు అని విమర్శించారు. శాండ్ పాలసీని మూడు ప్యాకేజీలుగా చేసి రూ.1528 కోట్లకి రాష్ట్ర ప్రభుత్వం జేపీ సంస్థకు ఇసుక దోపిడీ చేసుకోమని అగ్రిమెంట్ చేశారు అని దేవినేని ఉమా ఆరోపించారు. ఇసుక సత్యాగ్రహం కార్యక్రమంలో భాగంగా దేవినేని ఉమా మహేశ్వరరావు ఇబ్రహీంపట్నంలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మైన్స్అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయానికి బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దేవినేని ఉమా మహేశ్వరరావును అడ్డుకుని గృహనిర్బంధం చేశారు. అనంతరం దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఒక్క కృష్ణాజిల్లాలోనే రూ.21 కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కు కప్పం కట్టాలి అని చెప్పుకొచ్చారు. టీడీపీ పిలుపు మేరకు మైనింగ్ డైరెక్టర్ను కలిసేందుకు ఇబ్రహీంపట్నం వెళ్ళనివ్వకుండా పోలీసులను మైనింగ్ డిపార్ట్మెంట్ వద్ద కాపలా పెట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుడు పేదవాడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదా ? భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేకుండా వ్యవస్థ మొత్తం కుప్పకూలింది అని ధ్వజమెత్తారు. రూ.40 వేల కోట్ల ఇసుక డబ్బులు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయి అని ఆరోపించారు. జేపీ సంస్థ లేదు ! జగన్మోహన్ రెడ్డి ఇసుకాసురుడులాగా ఇసుక డబ్బులు దోచేశాడు అని ధ్వజమెత్తారు. మైలవరంలో ఎమ్మెల్యే పీఏలు నారాయణ బుజ్జులు, గజ్జలు ఇలా ఇసుకను దోచేస్తున్నారు అని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఇబ్రహీంపట్నం వెళ్లి తాము వినతి పత్రం అందజేస్తామంటే ఎందుకు భయపడుతున్నారు అని దేవినేని ఉమా నిలదీశారు. పోలవరాన్ని ముంచేశారు ఆ విషయాలను ఓ పత్రిక రాస్తే ఆ పత్రికవాళ్లను జైల్లో పెట్టించారని మండిపడ్డారు. రూ.12 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పులు వెళ్లాయి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పుకొచ్చారు.