Ap Liquor Scam: వాసుదేవరెడ్డి కోసం ముమ్మర గాలింపు

by srinivas |
Ap Liquor Scam: వాసుదేవరెడ్డి కోసం ముమ్మర గాలింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ట్విస్ట్ నెలకొంది. ప్రధాన నిందితుడు వాసుదేవరెడ్డి పరారయ్యారు. విదేశాలకు వెళ్లిపోయి ఉంటారని సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నెలన్నర రోజులుగా వాసుదేవరరెడ్డి కనిపించడంలేదు. దీంతో సీఐడీ ప్రత్యేక బృందం గాలిస్తోంది. ఆజ్ఞాతంలో ఉన్న ఆయన అరెస్ట్ నుంచి తప్పింకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తన లాయర్లతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన ఆయన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా వాసుదేవరెడ్డి పని చేశారు. ఆ సమయంలో మద్యం టెండర్ల విషయంలో ఆయన అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు విజయవాడ ఏపీఎస్ బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి ఫైళ్లు, కంప్యూటర్ల పరికరాలు, ఇతర కీలక పత్రాలు చోరీ చేశారని సైతం ఆరోపణలు వచ్చాయి. దీంతో జూన్ 6న వాసుదేవరెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. హదరాబాద్ లోని ఆయన నివాసాల్లో సోదాలు చేపట్టారు. అయితే అప్పటికే వాసుదేవరెడ్డి పారిపోయారు. దీంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సీఐడీ.. వాసుదేవరెడ్డిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed