సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఆ ఎంపీకి మార్పు తప్పదా..?

by srinivas |
సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఆ ఎంపీకి మార్పు తప్పదా..?
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్ సభ ఇంచార్జి మార్పుపై పంచాయితీ కొనసాగుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయులు ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గం ఇంచార్జిని మార్చాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు లావు శ్రీకృష్ణదేవరాయులతో మాట్లాడారు. నరసరావుపేట లోక్‌సభ నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించారు. ఇందుకు లావు శ్రీకృష్ణదేవరాయులు ససేమీరా అంటున్నారు. నరసరావుపేట నుంచి ఎంపీగానే తనకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్‌కే తెలిపారు. కానీ సీఎం జగన్ మాత్రం నరసరావుపే ఎంపీ బరిలో బీసీ నేతను దించితే గెలిచే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ మేరకు ఆ స్థానానికి బీసీ నేత నాగార్జునను బరిలో దించే యోచనలో ఉన్నారట.


మరోవైపు పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు మాత్రం నరసరావుపేట లోక్‌సభ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయులనే కొనసాగించాలని కోరుతున్నారు. కొత్త ఇంచార్జిని నియమిస్తే నాలుగైదు నియోజకవర్గాల్లో పరిస్థితులు మారతాయని, తద్వారా తమకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. గురుజాల, నరసరావుపేట, పెద్దకూర పాడు, మాచర్లలో నాయకులు, కార్యకర్తలతో లావు శ్రీకృష్ణదేవరాయులకు మంచి సంబంధాలు ఉండటంతో పలు సేవా కార్యక్రమాలు చేయడంతో మరోసారి గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. గుంటూరులో పోటీ చేస్తే ఓటమి తప్పదనే భావనను వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని ఇప్పటికే సీఎంవోకు కూడా చెప్పారు. అయితే గుంటూరు నుంచి లావును బరిలో దించాలని అధిష్టానం స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇందుకు ఆయన అనాసక్తి చూపుతున్నారు. మరి ఎమ్మెల్యేల ప్రతిపాదనలతో సీఎం జగన్ నరసరావుపేట విషయంలో వెనక్కి తగ్గుతారేమో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed