- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చర్చలు సఫలం.. కుదిరిన పొత్తు!.. వారికి ఎన్ని సీట్లంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికల్లో భాగంగా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చలు ముగిశాయి, పొత్తులపై చర్చలో భాగంగా రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవ్వాళ బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పొత్తులపై టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తొ్ంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ సంధర్భంగా టీడీపీని ఎన్డీఏలోకి బీజేపీ ఆహ్వానించింది. సీట్ల సర్ధుబాటులో భాగంగా జనసేన-బీజేపీలకు 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తొంది. అలాగే లోక్ సభ స్థానాల విషయానికి వస్తే.. జనసేన 2, బీజేపీ 6 పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీ చేయనున్నాయని సమాచారం. ఈ పొత్తుల లెక్కలపై ఇవ్వాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఏపీలో అధికార వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో టీడీపీ- జనసేన పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. అప్పటికే బీజేపీతో జనసేన కలిసి ఉండటంతో ఈ కూటమిలోకి బీజేపీని కలుపుకొని వెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపధ్యంలో ఇరు పార్టీల నేతలు సీట్ల సర్ధుబాటుకై ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. రెండు రోజుల క్రితం మరోసారి ఢిల్లీ వెళ్లిన నేతలు ఇవ్వాళ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి వైసీపీని ఢీ కొట్టనున్నాయి.
Read More..