AP News: సాగర్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి రంగం సిద్ధం

by Jakkula Mamatha |
AP News: సాగర్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి రంగం సిద్ధం
X

దిశ ప్రతినిధి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో తెలంగాణ రాష్ట్రానికి ముఖద్వారంగా ఉన్న నాగార్జున సాగర్ దక్షిణ విజయపురిలో ఉన్న ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి బీసీ.జనార్దన్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. దీనితో పాటు రాష్ట్రం లోని మరో 5 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌లుగా అభివృద్ధి చేయనున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సమీపంలో ఎయిర్ స్ట్రిప్‌ను 1955లో నిర్మించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వచ్చారు. అందుకు దక్షిణ విజయపురి - బౌద్ధ శిల్పాలు ఉండే అనుపు మధ్యలో 101 ఎకరాల్లో ఎయిర్ స్ట్రిప్ నిర్మించారు. ఆ తర్వాత ప్రాజెక్టుకు వచ్చిన వీఐపీలు ఈ ఎయిర్ స్ట్రిప్‌ను ఉపయోగించారు.1967లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ వచ్చి సాగర్‌ను ప్రారంభించారు.

ఆ తర్వాత ఈ ఎయిర్ స్ట్రిప్ నిరూపయోగంగా మారింది. దీని అభివృద్ధి గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2020లో ఓ ప్రైవేట్ ఏవియేషన్ సంస్థ దీనిని అద్దెకు తీసుకుని కొంతకాలం పైలట్లకు శిక్షణ ఇచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రం లోని 6 ఐరూర్తులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు కావటంతో విమానాశ్రయం నిర్మాణం వేగవంతం అయ్యింది. ఈ విమానాశ్రయం అభివృద్ధికి అవసరమైన పరిసర భూ వివరాలు 3 నెలల క్రితం కలెక్టర్ అరుణ్ బాబు ఆ ప్రాంతాన్ని పర్యటించి వివరాలను ప్రభుత్వానికి పంపారు. నాగులవరం, పశువేముల గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న 1670 ఎకరాలను గుర్తించి మ్యాప్‌లతో సహా నివేదించారు. భూ వివరాల నివేదికలు అందడంతో ముందుగా ఎయిర్ పోర్ట్‌ల అభివృద్ధి సాధ్యాసాధ్యాల పై ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సాంకేతిక కమిటీని నియమించింది.

ఈ కమిటీ ఎయిర్ పోర్ట్ ప్రతిపాదిత భూమిలో డబ్ల్యూ.జి.ఎస్-84 వ్యవస్థ,రెవెన్యూ మ్యాప్,ప్రతిపాదిత భూమి లైన్ డయాగ్రమ్ స్కెచ్, భూమి విండోర్స్ దయాగ్రం, కాంటూరు మ్యాప్,క్రిటికల్ ఎయిర్ క్రాఫ్ట్ టైప్,1:50 వేళలో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్, గత 10 ఏళ్ల లో మెటలార్జికల్ డిపార్ట్మెంట్ డేటా,టైప్ ఆఫ్ ఆపరేషన్ ,డిసై ర్డ్ -(వి ఎఫ్ ఆర్), ఆర్ (ఐ ఎఫ్ ఆర్) లో గురించి ప్రతిపాదిత భూమిలో అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయనానికి ఒక్కో ఎయిర్ పోర్ట్ కు 37.87 లక్షలు ఖర్చు అవుతుంది. సాగర్ ఎయిర్ పోర్ట్ తో పాటు రాష్ట్రంలోని మిగిలిన కుప్పం, తాడేపల్లి గూడెం,శ్రీకాకుళం, తుని - అన్నవరం, ఒంగోలు ఎయిర్పోర్ట్ ల అధ్యయనానికి నిధులు కేటాయించారు. పై ఎయిర్ పోర్ట్ లకు అవసరమైన భూ నివేదికలు ఇప్పటికే అందాయి. అధ్యయన కమిటీ కొద్ది రోజుల్లో రానుంది. కమిటీ నివేదిక అందగానే ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయని అధికార వర్గాలు చెప్పుకొస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed