- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు: ముగ్గురు అధికారుల సస్పెన్షన్
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో ప్రభుత్వం సీరియస్ అయింది. అధికారులపై చర్యలకు దిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న ముగ్గురు అధికారులపై వేటు వేసింది. మాజీ ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌తో పాటు సినియర్ అసిస్టెంట్ గౌతంను సస్పెండ్ చేశారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు కీలక ఫైల్స్ దగ్ధం అయిన విషయం తెలిసిందే. అయితే ఫైల్స్ దగ్ధంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆర్పీ సిసోడియా ఘటన స్థలంలో స్వయంగా విచారణ చేపట్టారు. భూములకు సంబంధించిన పలు కీలక డాక్యమెంట్స్, పత్రాలు దగ్ధమైనట్లు నిర్ధారించారు. ఘటన వెనుక ఉద్యోగుల పాత్ర ఉందని, పూర్తి విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తెలిపారు. నిందితులపై సోమవారం చర్యలు తీసుకున్నారు.