- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనసేన తొలి అభ్యర్థి ఖరారు.. అయన ఎవరంటే?
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తు్న్న పార్టీ అధినేతలు తమ అభ్యర్థుల బలాబలాలపై ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాల వారీగా ప్రైవేటు సంస్థలతో సర్వేలు చేయించి ప్రజల్లో మంచి పేరున్న వారిని ఎంపిక చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే తెనాలి నుంచి ఎవరో పోటీలో ఉంటారో తేలిపోయింది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఇన్నాళ్లు ఆ నియోజకవర్గ సీటు కోసం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా ఇద్దరు పోటీ పడ్డారు. అయితే, తాజాగా మాజీ మంత్రి ఆలపాటి రాజా చేసిన కామెంట్స్ బట్టి తెనాలి సీటు నాదెండ్ల మనోహర్‌కేనని తేలింది. సీటు ఎవరికి ఇవ్వాలనే నిర్ణయాన్ని పార్టీ అధినాయకుడికి వదిలేశామని ఆలపాటి ఆయన స్పష్టం చేశారు. తెనాలి సీటు ఎవరికీ ఇవ్వాలనే నిర్ణయం చంద్రబాబు, పవన్ కలిసి తీసుకుంటారని పేర్కొన్నారు. అధినేతలు ఏ నిర్ణయం తీసుకున్నా.. తామిద్దరం కలిసి పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. దీంతో నాదెండ్లకు తెనాలి సీటు ఖాయైనట్లే కదా.