- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:ముగిసిన పార్లమెంటరీ సమావేశం..టీడీపీ ఎంపీలకు సీఎం కీలక సూచనలు!
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతలతో నేడు (శనివారం) ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీలో నూతనంగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు రావాల్సిన నిధులపై భేటీలో చర్చించారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తావించాలని, నిధులు మంజూరు విషయం కూడా మాట్లాడాలని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారికి సూచించారు. రాష్ట్రాభివృద్ధే ప్రధాన అజెండాగా ఎంపీలు పోటీపడి పనిచేయాలన్నారు. విభజన హామీల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు.