సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

by Sathputhe Rajesh |
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్‌ బ్యూరో: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయిదు శాతం మార్కులు అదనంగా కలపాలని కోరుతూ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి కానిస్టేబుల్‌ రాతపరీక్షలలో ఫెయిలయిన అభ్యర్థులు ఇటీవల పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యి మంది సీఎం నివాసం వైపు వస్తారన్న సమాచారం అందడంతో పోలీసులు శనివారం అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గాల్లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

సీఎం ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. తాడేపల్లి వైపు వస్తున్న అభ్యర్థులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 22న కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల అయిదో తేదీన ఫలితాలు వెలువడగా.. 99 వేల మంది క్వాలిఫై కాగా మిగిలిన వారు డిస్‌ క్వాలిపై అయ్యారు. మరో 5శాతం మార్కులు అదనంగా కలిపితే తామూ కూడా క్వాలిఫై అవుతామని ఫెయిల్‌ అయిన విద్యార్థులు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.

Advertisement

Next Story