- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిలతో ఎవరికి డేంజర్?.. దడపుట్టిస్తున్న సర్వేలు
జగన్పార్టీకి ఓటెయ్యవద్దని వివేకా సతీమణి, కుమార్తె ప్రజలకు పిలుపునిచ్చారు. జగనన్న పాలన ఇదేనా అంటూ చెల్లి షర్మిల ఉతికారేస్తున్నారు. ఇవి చాలవన్నట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. మరోవైపు టీడీపీ కూటమితో బీజేపీతో పొత్తు వల్ల అధికార పార్టీ గ్రాఫ్పెరిగిందనే సర్వేలు సందడి చేస్తున్నాయి. కొన్ని జాతీయ సర్వే సంస్థలు మాత్రమే మోడీ హవా కొనసాగుతుందని చెబుతున్నాయి. వీటి మధ్య షర్మిల ప్రభావం అధికార పార్టీని పడగొడుతుందా.. వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా విపక్ష కూటమి విజయావకాశాన్ని దెబ్బతీస్తుందా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీకి ఓటెయ్యవద్దని వివేకా భార్య, కుమార్తె రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసులో నిందితులను సీఎం జగన్ కాపాడుతున్నారని ఆయన చెల్లెలు షర్మిల ఊరూరా చాటింపేస్తున్నారు. విభజన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో వైసీపీ, టీడీపీ, జనసేన అంటకాగుతున్నాయంటూ ఆమె తూర్పారబడుతున్నారు. తద్వారా తటస్ఠ ఓటర్లను ఆలోచనలో పడేస్తున్నారు. వైసీపీని షర్మిల దెబ్బతీస్తారని విశ్లేషకులు తొలుత అంచనా వేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీలిస్తే టీడీపీ కూటమి విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదని ఇప్పుడు చెబుతున్నారు.
షర్మిలతో కూటమికి డేంజర్?
చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలను బట్టి టీడీపీ, జనసేన కూటమికే విజయావకాశాలున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. బీజేపీతో పొత్తు తర్వాత వైసీపీ గ్రాఫ్ పది శాతం పెరిగిందంటున్నారు. వాస్తవానికి వైసీపీ సర్కారుపై వివిధ వర్గాల్లో ఎంతటి అసంతృప్తి ఉందో అంతకన్నా ఎక్కువగా బీజేపీ మీద వ్యతిరేకత నెలకొంది. సహజంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రధాన ప్రతిపక్షానికే సానుకూలంగా మారుతుంది. ఇక్కడ ప్రతిపక్ష కూటమి కాషాయ పార్టీతో కలవడం వల్ల వ్యతిరేక ఓటు భారీగా చీలిపోయేట్లుందని చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రభావం ఎంత పెరిగితే ప్రతిపక్ష కూటమికి అంత నష్టం వాటిల్లే అవకాశాలున్నట్లు పేర్కొంటున్నారు.
ఆత్మసాక్షి సర్వే నాడు అలా, నేడు ఇలా..
ఇటీవల ఒకట్రెండు జాతీయ సర్వే సంస్థలు ఎన్డీయే కూటమికే విజయావకాశాలున్నట్లు ప్రకటించాయి. 18 ఎంపీ స్థానాలతోపాటు 120 నుంచి 134 అసెంబ్లీ సీట్లను గెల్చుకునే అవకాశమున్నట్లు పేర్కొన్నాయి. అదే సమయంలో శ్రీ ఆత్మ సాక్షి సర్వే మాత్రం ఎన్డీయే కూటమి 60–65 అసెంబ్లీ స్థానాలకే పరిమితమవుతుందని బల్లగుద్ది చెబుతోంది. వైసీపీకి 110 స్థానాలకు పైగా రావొచ్చని అంచనా వేసింది. బీజేపీతో పొత్తుకు ముందు టీడీపీ, జనసేన కూటమి 120కు పైగా సీట్లతో తిరుగులేని ఆధిక్యతను చాటుతుందని ఇదే సర్వే సంస్థ వెల్లడించింది. కమలనాథులతో పొత్తు పెట్టుకుంటే ఓటమి తప్పదని హెచ్చరించింది. ప్రస్తుతం ఈ సర్వేలన్నీ అధికార ప్రతిపక్షాల్లో కలవరం పుట్టిస్తున్నాయి.
వైసీపీని వ్యతిరేకిస్తున్న వర్గాలు ఇవే..
అధికార వైసీపీకి మధ్యతరగతి, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, కౌలు రైతులు, యువత, అర్బన్ అసంఘటిత కార్మికులు వ్యతిరేకంగా ఉన్నట్లు శ్రీ ఆత్మ సాక్షి సర్వే వెల్లడిస్తోంది. గ్రామీణ పేదలు, మహిళలు, రైతులు, కూలీలు వైసీపీ మీద సానుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. రెండు నుంచి మూడు శాతం ప్రజలు మాత్రం స్పందించలేదని వెల్లడించింది. తటస్థ వైఖరిని ప్రదర్శించే ఓటర్లు ఐదు శాతం ఉండొచ్చు. అధికార ప్రతిపక్షాల తలరాతను మార్చేది వీళ్లే. పోలింగ్ నాటికి ఈ వర్గం మొగ్గు చూపేదాన్ని బట్టి విజయావకాశాలు ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Read More..
YSRCP: నేడు ఇడుపులపాయకు జగన్.. వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల..