ఆవిర్భావం వేళ.. జనసేన పార్టీకి ఆ దేశం నుంచి భారీ విరాళం

by GSrikanth |
ఆవిర్భావం వేళ.. జనసేన పార్టీకి ఆ దేశం నుంచి భారీ విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసేన నాయకులు పార్టీకి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా.. జనసేన కెనడా టీమ్ ఏకంగా రూ.14 లక్షల విరాళం ప్రకటించినట్లు సమాచారం. ఆవిర్భావ దినోత్సవం రోజున.. సభా వేదికపై రూ.14 లక్షల చెక్‌ను అధినేత పవన్ కల్యాణ్‌కు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆవిర్భావ వేడుకలకు మచిలీపట్నం సిద్ధమైంది. ప్లెక్సీలు, తోరణాలతో నగరాన్ని జనసైనికులు సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా సభా స్థలం వద్ద సినిమా ఫంక్షన్‌ను తలపించేలా ఏర్పాట్లు చేశారు.

Next Story