TDP: వైసీపీకి ఇంకా బుద్ది రాలేదు.. మంత్రి అచ్చెన్న హాట్ కామెంట్స్

by Ramesh Goud |
TDP: వైసీపీకి ఇంకా బుద్ది రాలేదు.. మంత్రి అచ్చెన్న హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజలు గుణపాఠం చెప్పినా వైఎస్ఆర్సీపీ(YSRCP)కి బుద్ది రాలేదని మంత్రి అచ్చెన్నాయుడు(Miniater Acchennayudu) విమర్శించారు. పంట బీమా(Crop Insurance) అమలుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ పార్టీ(YSRCP Party)పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన.. గత పాలనలో బీమా అంశంలో రబీలో సాగు చేసిన రైతులను పూర్తిగా గాలికి వదిలేసి నేడు ముసలి కన్నీరు కారుస్తున్న వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో కేవలం నాలుగేళ్లు ఒక సీజన్ కే బీమా అమలు చేసి రైతులకు వైసీపీ అన్యాయం చేసిందని, ఎన్‌డీఏ ప్రభుత్వం(NDA Government) ఏర్పడిన 40 రోజులకే ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఆదేశాలతో ముగ్గురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee) ఏర్పాటు చేసి బీమా మార్గదర్శకాలు జారీ చేశామని గుర్తు చేశారు. నామమాత్రపు ప్రీమియంతో(Premium) రెండు సీజన్లలో పంటలకు బీమాను అమలు చేయడంతో పాటు మామిడి పంట(Mango Crop)కూ బీమా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక వైఎస్ జగన్(YS Jagan) ప్రభుత్వంలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు, వ్యవసాయ రంగానికి అన్యాయం జరిగిందని అచ్చెన్న ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed