Kala Venkatrao: వైఎస్ జగన్‌కు ఎన్నికలంటే భయం

by srinivas |   ( Updated:2023-06-22 16:52:37.0  )
Kala Venkatrao: వైఎస్ జగన్‌కు ఎన్నికలంటే భయం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎన్నికలు అంటే భయం పట్టుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం అని హెచ్చరించారు. జగన్‍కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది ఇంకో ఛాన్స్ ఇవ్వరని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయాయని, కొత్త పరిశ్రమలు రావడం లేదని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్‌కు అభివృద్ధి చేయడం చేతకాదని చెప్పుకొచ్చారు. కేవలం అప్పులు చేయడం మాత్రమే తెలుసునని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు టీడీపీ పెట్టింది పేరు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు అన్నారు.

ఇవి కూడా చదవండి :: సీఎం జగన్ అడ్డాలో కాంగ్రెస్ దూకుడు.. 12 సార్లు విజయకేతనం

Next Story

Most Viewed