TDP: గత ఐదేళ్లలో రెండు మాత్రమే.. కేంద్రీయ విద్యాలయాలపై మంత్రి నారా లోకేష్

by Ramesh Goud |
TDP: గత ఐదేళ్లలో రెండు మాత్రమే.. కేంద్రీయ విద్యాలయాలపై మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్: గత ఐదేళ్లలో రెండు మాత్రమే వచ్చాయని, ఇప్పుడు మరో తొమ్మిది సాధించబడ్డాయని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) తెలిపారు. కేంద్ర ప్రభుత్వం(Central Government) ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) కు కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలను(Kendriya Vidhyalayas) మంజూరు చేసింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా.. మార్చి 2019 నాటికి, ఆంధ్రప్రదేశ్‌లో 33 కేంద్రీయ విద్యాలయాలు (కెవిలు) ఉన్నాయని చెప్పారు.

గత ఐదేళ్లలో కేవలం 2 కొత్త కెవిలు(KV'S) మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయని, అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) దార్శనిక నాయకత్వంలో ఇప్పుడు ఒక కొత్త మైలురాయిని సాధించారని ఆనందం వ్యక్తం చేశారు. కేవలం ఒక సంవత్సరంలోనే 9 కొత్త KVలు మంజూరు చేయబడ్డాయని, ఐఐటీ తిరుపతి(IIT Thirupathi)లో ఒకదానితో సహా మొత్తం వీటి సంఖ్య 44 కి చేరుకుందని అన్నారు. అలాగే మా ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని, ముఖ్యంగా వికలాంగ విద్యార్థులు, అట్టడుగు వర్గాల పిల్లలు వెనుకబడకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని లోకేష్ అన్నారు.



Next Story

Most Viewed