- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
AP:సొంత కారును అంబులెన్స్‌గా మార్చిన టీడీపీ ఎమ్మెల్యే..!
దిశ,వెబ్‌డెస్క్:రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవీ పెద్ద మనసు చాటుకున్నారు. తన నియోజకవర్గంలో ప్రజల కష్టాలను ఆమె చూడలేకపోయారు. ఇటీవల రంపచోడవరం మండలం దారగూడెంకు చెందిన ఓ మహిళ కాకినాడ జీజీహెచ్‌లో చనిపోయింది. అయితే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకుండా పోయింది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే శిరీష దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే స్వచ్ఛందంగా రూ.5500లతో అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి మృతదేహం గ్రామానికి చేర్చారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రజల కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు తన ప్రచారానికి ఉపయోగించిన కారును ఆమె అంబులెన్స్‌గా మార్చారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్ల ఆమె తెలిపారు. కాకినాడ, రాజమండ్రి, నర్సీపట్నం ఆస్పత్రుల్లో మృతి చెందిన వారిని నియోజకవర్గానికి తీసుకొచ్చేందుకు దీనిని ఉపయోగించనున్నారు. అంబులెన్స్ నిర్వహణకు తన సొంత డబ్బులు ఇవ్వనున్నారు.