- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోకేష్ ‘శంఖారావం’ యాత్ర మొదలైంది.. తరలివచ్చిన పసుపుదళం
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రచారాల స్పీడ్ మరింత పెంచింది. ఈ నేపథ్యంలోనే యువనేత నారా లోకేష్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి శంఖారావం కార్యక్రమం ప్రారంభించారు. మొదటగా ఇచ్చాపురంలో ఉదయం రాజావారి గ్రౌండ్స్ శంఖారావం కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమానికి భారీగా పసుపుదళం కదిలివచ్చింది. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్‌లో ప్రతిభకనబర్చిన 50 మంది కార్యకర్తలకు అభినందించారు.
కాగా, సభలో ప్రసంగం అనంతరం ఇచ్చాపురం నియోజకవర్గ పార్టీ కేడర్‌తో లోకేష్ ముఖాముఖిలో పాల్గొంటారు. పార్టీ కేడర్‌కు లోకేష్ చేతులమీదుగా సూపర్ 6 కిట్లు అందజేస్తారు. మరోవైపు పార్టీ కేడర్‌తో ఆయన ప్రతిజ్ఞ చేయించనున్నారు. కాగా, ప్రతిరోజు మూడు నియోజకవర్గాల్లో శంకారావం కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతినియోజకవర్గంలో నియోజకవర్గ పార్టీ కేడర్‌తో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. శంఖారావం కార్యక్రమం పూర్తి అయిన తర్వాత సాయంత్రం 7 గంటలకు నరసన్నపేట పరిధిలోని గ్రామ శివారులో లోకేష్ బస్ చేయనున్నారు.
Read More..
AP కాంగ్రెస్‌లో నయా జోష్.. ఊహించని రేంజ్‌లో హస్తానికి హైప్ తీసుకొచ్చిన YS షర్మిల..!