- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ ఎమ్మెల్యేపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం
దిశ, వెబ్ డెస్క్: ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు రావడం చాలా కష్టమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కాంట్రాక్టర్ల గొంతుపై కత్తిపెట్టి బెదిరిస్తే పనులు అవుతాయా అని ఆయన ప్రశ్నించారు. గతేడాది విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సందర్భంగా సీఎం జగన్, మంత్రి అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నారా లోకేశ్ విమర్శలు కురిపించారు. ఇన్వెస్టర్స్ మీట్‌లో రూ.13.12 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని, గొప్పలు చెప్పిన మంత్రి అమర్‌నాథ్.. ఏడాది అవుతున్నా ఒక్క పరిశ్రమ కూడా ఎందుకు రాలేదని లోకేశ్ ప్రశ్నించారు. జేటాక్స్ వల్లే ఏపీ నుంచి జాకీ, లులు కంపెనీలు వెళ్లిపోయాయని ఎద్దేవా చేశారు. ఈ రెండు కంపెనీలు పరారు కావడంతో మిగిలిన పారిశ్రామిక వేత్తలు కూడా రాష్ట్రంవైపు చూడటం లేదన్నారు. జాకీ కంపెనీని ఎమ్మెల్యే తోపుతుర్తి తరిమివేశారని నారా లోకేశ్ ఆరోపించారు. ఇటీవల ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేసే 11 మందిని బెదిరించారని తెలిపారు. ఈ ఘటనపై బెంగాల్ ఎంపీ అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారని తెలిపారు. ఇలాంటి నేతలుంటే ఇంకెవరు పెట్టుబడులు పెడతారని నారా లోకేశ్ విమర్శించారు.