Viveka Murder Case: సునీల్ యాదవ్‌కు బెయిల్ నిరాకరణ

by srinivas |   ( Updated:27 Feb 2023 11:07 AM  )
Viveka Murder Case: సునీల్ యాదవ్‌కు బెయిల్ నిరాకరణ
X

దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయాలని వేసిన పిటిషన్‌‌ను ధర్మాసనం కొట్టివేసింది. అంతేకాదు సునీల్ యాదవ్‌కు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తులో ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. నిందుతుల స్వేచ్ఛ కంటే సాక్షుల భద్రత, పారదర్శక దర్యాప్తు ముఖ్యమని స్పష్టం చేసింది. కాగా వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇవ్వొద్దని నాలుగు రోజుల క్రితం హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశలో కొనసాగుతోందని, హత్యలో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ పేర్కొంది.

Next Story

Most Viewed