తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు: మంత్రి

by Disha News Desk |
తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు: మంత్రి
X

దిశ, ఏపీ బ్యూరో: పాఠశాలలకు సెలవంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ హెచ్చరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ, పాఠశాలల్లో తరగతులు నిర్వహణ ప్రశాంతంగా జరుగుతుంది స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా పాఠశాలలకు సెలవులు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హాస్టల్‌ విద్యార్థులు ఇళ్లకు వెళ్లాలని కొందరు ప్రచారం చేస్తున్నారనీ, ప్రముఖ ఛానెల్స్‌ పేరుతో మార్ఫింగ్‌ చేసి బ్రేకింగ్‌ న్యూస్‌ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని మంత్రి ఆదిమూలపు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed