Palakollu: టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు.. అధికారులను నిలదీసిన కేంద్రమంత్రి

by srinivas |   ( Updated:2023-06-22 14:10:59.0  )
Palakollu: టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు.. అధికారులను నిలదీసిన కేంద్రమంత్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేయడంపై కేంద్రమంత్రి భారతి ప్రవీన్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్లను ఆమె పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమైన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేయండంపై నిప్పులు చెరిగారు. టిడ్కో ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన పథకం కింద నిధులను మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. అలాంటప్పుడు గృహ సముదాయం వద్ద ప్రధాని నరేంద్రమోదీ ఫొటో, పీఎంఏవై లోగో లేకపోవడంపై అధికారులను నిలదీశారు. ప్రతి గృహ సముదాయంపై ప్రధాని నరేంద్రమోడీ ఫొటో, పీఎంఏవై లోగో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి :: TTD: శ్వేతపత్రం విడుదల చేస్తాం.. శ్రీవాణి ట్రస్ట్‌ నిధులపై ఈవో కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story