Srikakulam: ప్రమాదశాత్తు చెరువులో పడి తండ్రి, కూతురు మృతి

by srinivas |   ( Updated:2023-09-05 14:09:28.0  )
Srikakulam: ప్రమాదశాత్తు చెరువులో పడి తండ్రి, కూతురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా పోతినాయుడుపేటలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి, కూతురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. మృతులు మిత్తన కామేష్, రాజేశ్వరిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చెరువుల వద్దకు వెళ్లేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో చెరువుల వద్దకు అసలు వెళ్లొద్దని, ఈతలకు దిగొద్దని పేర్కొన్నారు. చెరువులు, కాలువల గట్టులపై నడవొద్దన్నారు. అలాగే చేపల వేటకు సైతం వెళ్లకూడాదని పోలీసులు సూచించారు. గ్రామ చెరువులైతే తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

Advertisement

Next Story