సీఎం జగన్ తీరును జాతీయ స్థాయిలో ఎండగడతాం: Rammohan Naidu

by srinivas |
సీఎం జగన్ తీరును జాతీయ స్థాయిలో ఎండగడతాం: Rammohan Naidu
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది అక్రమ అరెస్ట్ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ఏపీ అభివృద్ధికి టీడీపీ-జనసే పొత్తు అవసరమని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని జగన్ భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ తీరును పార్లమెంట్ సమావేశాల్లో ఎండగడతామని చెప్పారు. చంద్రబాబు పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన సీఎం జగన్ తీరును జాతీయ స్థాయికి తీసుకెళ్తామని రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.

Advertisement

Next Story