- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మంత్రి పెద్దిరెడ్డిపై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం.. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు జైలు నుంచి విడుదలకావాలని శ్రీకాకుళం టీడీపీ కార్యకర్తలు చేపట్టిన సైకిల్ యాత్రను చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ నేతలు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ పాలనలో ఏ యాత్ర చేసినా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. తాజాగా ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు చేసిన దౌర్జన్యాన్ని ఖండించారు. పుంగనూరులో జరిగిన ఘటన నలుగురు వ్యక్తులకు సంబంధించినది కాదని.. యావత్తు ఉత్తరాంధ్రను అవమానించారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇతర జిల్లాలకు వెళ్లాలంటే వీసా, పాస్ పోర్టు తీసుకోవాలా అని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
అప్పుడు మిధున్ రెడ్డి.. ఇప్పుడు పెద్దిరెడ్డి
తమ జిల్లా వాసులను బట్టలు విప్పి పెద్దిరెడ్డి అనుచరులు అవమానించారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. పార్లమెంట్‌లో ఎంపీ మిథున్ రెడ్డి తనను అవమానించారని, ఇప్పుడు పెద్దిరెడ్డి శ్రీకాకుళం వాసులను అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు తక్షణమే పెద్దిరెడ్డి క్షమాపణలు చెప్పాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా వాసులను అవమానిస్తే ఆ ప్రాంత మంత్రులు నోరు మూసుకుంటారా అని ధ్వజమెత్తారు. సిక్కోలు వాసులను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్‌ది దొంగ ప్రేమని విమర్శించారు. రాజధాని పేరుతో ఇక్కడికి వస్తున్నది ప్రజలను ఉద్ధరించడానికి కాదని, సహజ వనరులను దోచుకోవడానికని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. చంద్రబాబుపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపారని.. ఒక్క ఆధారమైనా చూపించగలిగారా అని రామ్మోహన్ నాయుడు నిలదీశారు. కాలయాపన చేస్తూ చంద్రబాబును కావాలనే జైల్లో నిర్బంధించారని.. కాని న్యాయం ఏదో ఒక రోజు గెలుస్తోందని రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.