- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యువతకు టీడీపీ తోనే విద్య,ఉపాధి అవకాశాలు:రామ మల్లిక్ నాయుడు
దిశ ప్రతినిధి,శ్రీకాకుళం: యువతకు టీడీపీ తోనే ఎక్కువ విద్య, ఉపాధి అవకాశాలు లభించాయని TDP రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ మల్లిక్ నాయుడు అన్నారు. గురువారం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని చిలకపాలెంలో ఉన్న శ్రీ శివాని కాలేజ్ విద్యార్థులతో “మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు విద్యా విధానంలో ఆయన తీసుకున్న అనేక నిర్ణయాల కారణంగా రాష్ట్రంలోని యువత దేశ, విదేశాల్లో నేడు ఉన్నత స్థానాలకు చేరుకున్నారన్నారు.చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగానే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి ధీటుగా సైబరాబాద్ నగర నిర్మాణం జరిగిందన్నారు. నేడు తాము నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ జీవితాలు బాగు పడాలి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారని పేర్కొన్నారు.