- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nellore: వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోం!
దిశ, బుచ్చిరెడ్డిపాళెం: ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డిపై అక్రమంగా కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని టీడీపీ నేతలను వైసీపీ నాయకులు హెచ్చరించారు. పోలింగ్ బూతులో ఓ అధికారి టీడీపీకి ఓట్లు వేస్తుంటే దాన్ని ప్రశ్నించిన తమపై కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. బుచ్చిరెడ్డిపాళెం వైసీపీ కార్యాలయంలో వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ బూతులోకి ఎమ్మెల్యే చొరబడ్డారంటూ టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. ఏ అర్హత ఉంటే పోలంరెడ్డి దినేష్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెల్లడో చెప్పాలని డిమాండ్ చేశారు.
పెన్నా డెల్టా మాజీ చైర్మన్ ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లికి బిక్షం పెట్టని పిసినారి పోలంరెడ్డిని, ఆయన తనయుడు దినేష్ రెడ్డిని చూసుకుని టీడీపీ నాయకులు చొక్కాలు చింపుకోవద్దని హితవు పలికారు. వార్డు నెంబరుగా కూడా గెలవలేని విడవలూరుకు చెందిన ఓ బీసీ నాయకుడు బుచ్చి వైసీపీ నాయకులపై తొడలుకొట్టడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి : Rastrapati Bhavan: ఏపీకి చెందిన నలుగురికి పద్మ అవార్డుల ప్రదానం