- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్‌ఆర్‌ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News: ఉదయగిరి టీడీపీ సీటు ఎవరికి..!
దిశ, నెల్లూరు: ఉదయగిరి నియోజకర్గంలో టీడీపీకి క్యాడర్ బలంగానే ఉన్నా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు తీరుతో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో ప్రస్తుత ఇంచార్జిగా ఉన్నా రామారావు తన వ్యాపారాల రిత్యా ఇతర రాష్ట్ర్రాలను పరిమితమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. గడిచిన మూడున్నరేళ్లుగా కార్యకర్తలను పట్టించుకోని బొల్లినేని ఎన్నికల వచ్చేసరికి పార్టీ టికెట్ కోసం ఏదో మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారని ఆ పార్టీ నేతలు బాహాటంగానే చర్పించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో బొల్లినేనిని గెలిపిస్తే పార్టీ క్యాడర్‌ను పట్టించుకోకుండా వాడుకుని వదిలేసాడన్న ఆరోపణల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో బొల్లినేనికి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయిస్తే తాము పార్టీకి పని చేయబోమని కార్యకర్తలంతా అధిష్టానానికి తెగేసిచెప్పినట్లుగా తెలిసింది.. అందుకే వచ్చే ఎన్నికల్లో వేరెవరికైనా టికెట్ కేటాయిస్తే బాగుంటుందని పార్టీ నేతలు చంద్రబాబుకు సూచించారని సమాచారం. దీంతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావుకు 2024 ఎన్నికల్లో సీటుకు ఎసరు తప్పదేమోనని అంతా భావిస్తున్నారు. కార్యకర్తల సూచన మేరకు పార్టీ అధిస్ఠానం ఉదయగిరి నుంచి కొత్త వ్యక్తిని బరిలో దింపే యోచనలో ఉందని ఈ నేపథ్యంలో బొల్లినేనికి చెక్ పెట్టేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాకర్లకు అవకాశం ఇస్తారా?
ప్రస్తుతం ఉదయగిరి టీడీపీలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే కొత్త వ్యక్తిని వచ్చే ఎన్నికల బరిలో దించే యోచనలో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వింజమూరు వేదికగా కార్ల ట్రస్టు ప్రారంభోత్సవం పేరుతో ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్ భారీ కార్యక్రమం నిర్వహించారు. పేరుకు సేవ కార్యక్రమమే అయినప్పుటికీ అక్కడ జరిగిన పరిణామాలు గమనిస్తే ట్రస్టు పేరుతో రాజకీయ ప్రవేశం చేయబోతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉదయగిరి బరిలో వచ్చే ఎన్నికల్లో కాకర్ల సురేష్‌కు టీడీపీ అధిష్టానం అవకాశం ఇచ్చే ఛాన్స్ అధికంగా ఉన్నాయని తెలుస్తుంది. జిల్లాలో ఇటీవల జరిగిన చంద్రబాబు పర్యటనలో కూడా సురేష్ భారీగా బాబుకు అనుకూలంగా పత్రిక ప్రకటనలు ఇచ్చారు. వింజమూరులో జరిగిన కార్యక్రమానికి బొల్లినేని రామారావుకు ఆహ్వానం ఉన్నప్పుటికి ఆయన రాలేదు. అంతేకాకుండా ఆయన వర్గీయులు కాకర్ల ట్రస్టు ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టడం బొల్లినేని వ్యతిరేక వర్గీయులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో రాజకీయంగా చర్చనీయాసంమైంది.
చంద్రబాబు అవకాశం ఇస్తే పోటీ చేస్తా: కాకర్ల సురేష్
టీడీపీ అధిష్టానం పిలుపునిస్తే తాను తప్పకుండా పోటీ చేస్తానని ఇంత వరకు తాను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని చంద్రబాబు, లోకేష్ పిలుపునిస్తే సిద్ధంగా ఉన్నానని కాకర్ల సురేష్ తెలిపారు. తమకు బొల్లినేని రామారావుతో ఎలాంటి విభేదాలు లేవని, ట్రస్టు ప్రారంభోత్సవానికి కూడా పిలవడం జరిగిందన్నారు. కోవిడ్ సమయంలో టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగంలో అక్కడ కరోనాతో మృతి చెందిన ఆంధ్రులను స్వరాష్త్రం పంపే క్రమంలో లోకేష్‌కు కాకర్ల పరిచయం అయ్యారు. ఈ నేపథ్యంలో కాకర్లకు ఉదయగిరి నుంచి అవకాశం ఇచ్చే ఆలోచలో లోకేష్ ఉన్నారని సమాచారం. దీనికి తోడు కాకర్లకు టికెట్ ఇస్తే పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ పార్టీ నేతలు లోకేష్‌తో అన్నారని తెలిసింది.. ఏది ఏమైనా ఉదయగిరిలో టీడీపీ భవిష్యత్తు కోసం ఎమ్మెల్యే టికెట్ ఎవరికి కేటాయిస్తారన్నాది వేచి చూడాలి.
READ MORE