Nara Lokesh: అనిల్‌కు దిమ్మ తిరిగే సవాల్.... మరి వస్తాడా ?

by srinivas |
Nara Lokesh: అనిల్‌కు దిమ్మ తిరిగే సవాల్....  మరి వస్తాడా ?
X

దిశ, వెబ్ డెస్క్: దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేసిన సవాల్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ‘జగన్ అల్‌రెడీ నీ సీటు చించేశాడు బ్రదర్’ అంటూ అనిల్‌పై సెటైర్ వేశారు. ఈ హాఫ్ నాలెడ్డ్ వ్యక్తి గతంలో మంత్రి అయ్యాడని వ్యంగ్యంగా విమర్శించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో యువగళం పాదయాత్ర చేపట్టిన నారా లోకేశ్ నెల్లూరు జిల్లాకు అనిల్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్టైనా తెచ్చాడా? అని ప్రశ్నించారు. అలాంటి ఈ సిల్లీ బచ్చా తనకు సవాల్ విసురుతున్నాడని ఎద్దేవా చేశారు. నాయుడుపేటలో తిరుగుతున్నానని.. అంత సరదాగా ఉంటే.. బినామీల పేరుతో అనిల్ వేసిన రూ.100 కోట్ల అక్రమ లే అవుట్ పై చర్చిద్దాం.. రా.. అని లోకేశ్ పత్రి సవాల్ విసిరారు. వచ్చేటప్పుడు సీఎం జగన్ కూడా తీసుకురావాలని, దమ్ముంటే నీకు సీటు ఉందని చెప్పించాలని నారా లోకేశ్ ఛాలెంజ్ చేశారు.

Advertisement

Next Story