Alapati Raja: కరోనా కంటే జగన్ పాలన డేంజర్

by srinivas |
Alapati Raja: కరోనా కంటే జగన్ పాలన డేంజర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ జగన్ పాలన కరోనా కంటే ప్రమాదకరమని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. కరోనా రెండేళ్లు మాత్రమే వేధించి వెళ్లిపోయిందని, కానీ వైఎస్ జగన్ మాత్రం నాలుగేళ్లుగా వేధిస్తూ చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంటుందని ఆయన ఆరోపించారు. విభజించు పాలన అన్న చందంగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని.. అమ్మఒడి పేరుతో ఒకే ఇంట్లోని ఇద్దరు పిల్లల్ని విడగొడుతున్నారని చెప్పారు. మద్యం దుకాణాల ద్వారా రూ.40 వేల కోట్ల వ్యాపారం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని చూస్తుందని విమర్శించారు. యధా రాజా తథా ప్రజా అన్న చందంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా జగన్ మోహన్ రెడ్డి బాటలో అరాచకాలు సృష్టిస్తున్నారని, ప్రజా సంపదలు దోచుకుంటున్నారని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు



Next Story

Most Viewed