- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mla Sridhar Reddy: సజ్జల షాడో సీఎం.. ఎంత వేధించినా తగ్గేదేలే!
దిశ, నెల్లూరు: షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తనను ఎంత వేధించినా తగ్గేదేలేదని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తనపై ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోమని తాను, తన కార్యకర్తలు భయపడేది లేదన్నారు. శ్రీధర్ రెడ్డి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తనతో సహా 11 మంది మీద ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. గతంలో వైసీపీకి టీడీపీ మధ్య జరిగిన వివాదంలో ఇప్పుడు తన పేరు చేర్చారని ఆరోపించారు.
తన తమ్ముడు గిరిని వైసీపీలోకి లాక్కోవాలని చూస్తే అది సజ్జల వల్ల కాదని, తన సన్నిహితులు తాటి వెంకటేశ్వర్లు, జావీద్, మన్నేపల్లి రఘును అరెస్ట్ చేశారని శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన తీరు పోలీసుల వైఖరి ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అనుకున్నట్టుగానే తనకు పోలీసు వేధింపులు ఉంటాయని. షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి పనులు అన్నీ మానుకుని నెల్లూరు రూరల్ పనిలో ఉన్నట్టున్నారని విమర్శించారు. సజ్జల ఆదేశాలు మేరకు పోలీసులు ఇక్కడ నడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అరెస్ట్ చేశాక పోలీసులు స్టేషన్‌కు తీసుకుపోకుండా హైవేల్లో తిప్పుతూ భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. జగన్ పార్టీ పెట్టినప్పుడు తాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కార్పొరేటర్‌గా ఉన్నారని, ఆయన తన పదవికి రాజీనామా చేసి జగన్ పాదయాత్రలో పాల్గొన్నారని శ్రీధర్ రెడ్డి గుర్తు చేశారు.