వెన్నుపోటుకు బలి కానున్న షర్మిల..పులివెందులలో ఆమెకు చెక్ పెట్టెదవరూ?

by Jakkula Mamatha |   ( Updated:2024-05-05 11:34:32.0  )
వెన్నుపోటుకు బలి కానున్న షర్మిల..పులివెందులలో ఆమెకు చెక్ పెట్టెదవరూ?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారం జోరు పెంచారు. ఈ క్రమంలో పార్టీల మధ్య మాటలు తూటాల్ల పేలుతున్నాయి. రాష్ట్రంలో అన్నాచెల్లెళ్ల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల సొంత అన్న చెల్లెలు అయిన వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ క్రమంలో ఏపీ పీసీసీ షర్మిల ,సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపిస్తుంది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ సతీమణి భారతి అండ్ ఎంపీ అభ్యర్థి అవినాష్ సతీమణి పులివెందులలో మండుటెండను సైతం లెక్క చేయకుండా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే అని వారు ప్రజలకు చెబుతూ తమ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిలకు బిగ్ షాక్ తగలనున్నట్లు సమాచారం. ఇంతకాలం ఒక ఓటు అన్నకు పడిన ఎంపీ ఓటు తనకు పడుతుందని ఆశించిన షర్మిలకు తాజాగా పులివెందుల ప్రజలు వైఎస్సార్ కుటుంబానికి జై కొట్టడంతో కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు గురవుతుందని అంటున్నారు. కడప ఎంపీగా ఆమె పోటీ చేస్తున్న ఆమెకు డిపాజిట్లు డౌట్ అని సీఎం జగన్ ఇప్పటికే పలు సభలలో అన్నారు.

Read More..

AP Politics: బెట్టింగ్ మార్కెట్‌లోనూ విజేతగా నిలిచిన కూటమి..

Advertisement

Next Story