Kesineni Nani: టీడీపీలో ప్రక్షాళన జరగాలి. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-01-15 08:44:55.0  )
Kesineni Nani: టీడీపీలో ప్రక్షాళన జరగాలి. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీలో ప్రక్షాళన జరగాలని.. చీటర్లు, రియల్ ఎస్టేట్ మోసాలు చేసిన వారు, కాల్ మనీ గాళ్ళకు ఎన్నికల్లో టీడీపీ తరుఫున టికెట్ ఇవ్వొద్దన్నారు. తన తమ్ముడి చిన్ని, మరో ముగ్గురికి టికెట్ ఇస్తే వారికి తాను మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పారు. నాకంటే కేశినేని చిన్ని యాక్టివ్‌గా ఉంటే మంచిదేనన్నారు. ల్యాండ్ గ్రాఫ్రర్లు, ఉమెనైజర్లకు సీటు ఇచ్చి.. టీడీపీ సిద్ధాంతాన్ని పక్కదారి పట్టించొద్దని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఢిల్లీ స్థాయి నాయకుడినని.. తన సేవలు కావాలంటే పార్టీ వాడుకోవచ్చని తెలిపారు. పార్టీ మంచి క్యారెక్టర్ ఉన్నోడికి టికెట్ ఇస్తే.. ఎంపీని చేస్తానని పేర్కొన్నారు. తాను ఎంపీ అయితేనే ఈ స్థాయి రాలేదని.. తనకు ఓ బ్రాండ్ ఉందన్నారు. ఎన్టీఆర్ గొప్ప ఆశయాలతో టీడీపీని స్థాపించారని.. ఎవరికి పడితే వారికి టికెట్లు ఇచ్చి పార్టీ సిద్ధాంతాన్ని చెడగొట్టొదని వ్యాఖ్యానించారు.

Read more:

నా పొరపాటును మన్నించండి.. దేవాంగులకు Balakrishna క్షమాపణ

Advertisement

Next Story