విశాఖలో డ్రగ్ కంటైనర్ కలకలం.. సంధ్యా ఆక్వా వివరణ ఇదే..!

by srinivas |   ( Updated:2024-03-22 11:36:48.0  )
విశాఖలో డ్రగ్ కంటైనర్ కలకలం.. సంధ్యా ఆక్వా వివరణ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ తీరంలో 25 వేల కేజీల డ్రగ్‌ను తీసుకొచ్చిన కంటైనర్‌ను సీపోర్టు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ డ్రగ్ సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోసం తీసుకొచ్చినట్లుగా తేలింది. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ కంపెనీ యాజమాన్యానికి వైసీపీతో సంబంధం ఉందని ప్రచారం జరుగుతోంది. అటు వైసీపీ నేతలు ఈ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, చంద్రబాబుకు సంబంధించిన బంధుల కంపెనీ అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో డ్రగ్ కంటైనర్‌పై సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ హరి లేఖ రూపంలో వివరణ ఇచ్చారు.


‘రొయ్యల మేతలో వాడే ఈస్ట్‌ను మొదటిసారి బ్రెజిల్ నుంచి ఆర్డర్ ఇచ్చాం. తక్కువ రేట్‌కు మంచి క్వాలిటీ ఈస్ట్ లభిస్తుండడంతో ఐసీసీ- బ్రెజిల్ కంపెనీకి డిసెంబర్‌లో డబ్బు చెల్లించాం. జనవరి 14 న బ్రెజిల్ శాంతోస్ పోర్ట్‌లో బయల్దేరి మార్చ్ 16న విశాఖ వచ్చింది. ఇంటర్ పోల్ సమాచారంతో సీబీఐ తమ సమక్షంలో కంటైనర్ ఓపెన్ చేసి డ్రగ్ టెస్ట్ చేశారు. నిషేధిత డ్రగ్‌గా సీబీఐ అనుమానిస్తోంది. ఐసీసీ బ్రెజిల్ మాత్రం ఎలాంటి నిషేధిత డ్రగ్ సరఫరా చేయలేదని, నిరూపించడానికి సిద్ధం అని చెప్తోంది. ఇంకా టెస్ట్‌లు జరగాల్సి ఉంది. మా ప్రమేయం ఏమీ లేదు. విచారణకు సహకరిస్తాం. రాజకీయాల కోసం పార్టీలు దీన్ని వాడుకోవడం విచారకరం. తమకు ఏ రాజకీయపార్టీతోనూ మాకు సంబంధం లేదు.’ అని సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ హరి పేర్కొన్నారు.

Advertisement

Next Story