- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Ap News: ఆ 11 కూడా రావట..!

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)పై అధికార పార్టీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. గుంటూరు(Guntur) మిర్చి యార్డు పర్యటనలో జగన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. అంతేకాదు మద్దతు ధరపై జగన్ చేసిన వ్యాఖ్యలకు తప్పుబడుతున్నారు. ఇచ్చింది కొంత అయితే చెబుతోంది మరింత అంటూ ఎద్దేవా చేస్తున్నారు. జగన్ హయాంలో రైతులకు ఇచ్చిన మద్దతుకు సంబంధించిన జీవోలను చూపిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
రైతుల(Farmers) గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) వ్యాఖ్యానించారు. జగన్ ఐదేళ్ల పాలనలో 14 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. జగన్ పాలనలో రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడోస్థానంలో నిలిచిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను భయపెట్టేలా జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వైఖరి ఇలాగే ఉంటే భవిష్యత్లులో 11 సీట్లు కూడా రావాలని ఎద్దేవా చేశారు. జగన్‌కు రెడ్ బుక్ ఫోబియా పట్టుకుందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.