Breaking: యాసిడ్, గ్యాస్ లోడ్ లారీలు ఢీ.. భయం..భయం

by srinivas |   ( Updated:2024-05-27 16:08:44.0  )
Breaking: యాసిడ్, గ్యాస్ లోడ్ లారీలు ఢీ.. భయం..భయం
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా అన్నవరం శివారు ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. తేటగుంట రహదారిపై గ్యాస్, యాసిడ్ లోడ్ లారీలు ఢీ కొన్నాయి. ఈ ఘటనతో ఓ లారీ నుంచి భారీగా యాసిడ్ రోడ్డుపై పడుతోంది. మరోవైపు గ్యాస్ లారీలో డ్రైవర్ ఇరుక్కుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. గ్యాస్ లారీలో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.


అయితే యాసిడ్ రోడ్డుపై పడుతుండటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యాసిడ్ లీక్‌తో గ్యాస్ లారీకి మంటలంటుకుంటాయోనని భయపడుతున్నారు. మరోవైపు పోలీసులు, ఫైర్ సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.


Read More...

లోయలోకి దూసుకెళ్లిన ఆటో..ముగ్గురి పరిస్థితి సీరియస్


Advertisement

Next Story