- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుప్పం ఇంచార్జిగా కంచర్ల శ్రీకాంత్‌కు బాధ్యతలు
దిశ, కుప్పం: వై నాట్ కుప్పం నినాదంతో వైసీపీ ముందుకొస్తున్న నేపథ్యంలో చంద్రబాబునాయుడు అప్రమత్తమయ్యారు. ఎప్పుడూ లేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ ఉత్సాహంతో చంద్రబాబును కూడా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓడిస్తామని వైసీపీ నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబుకు తత్వం బోధపడింది. ఇలాగైతే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని ఆయన గ్రహించి మేల్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ప్రతి మూడు రెండు నెలలకు ఒకసారి స్వయంగా ఆయనే కుప్పానికి వెళుతూ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.
దిద్దుబాటు చర్యలు
కుప్పం టీడీపీలో ఏం జరుగుతుందో ఆరా తీశారు. ఇక్కడ పార్టీ పరిస్థితులపై స్వయంగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. భారీ మెజారిటీ విజయం సాధించేందుకు ఎలాంటి ఎత్తుగడలు వేయాలో ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపొందించి.. దీనికి అనుగుణంగా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. టీడీపీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న తన పీఏ మనోహర్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో కాస్త పక్కన పెట్టారు. అయితే అది తాత్కాలికమే.
శ్రీకాంత్ కు బాధ్యతలు
తాజాగా తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలుపొందిన కంచర్ల శ్రీకాంత్‌కు కుప్పం టీడీపీ బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప వంటి స్థానాలను ఢీకొట్టిన శ్రీకాంత్ పట్టభద్రుల ఎన్నికల్లో అధికార వైసీపీకి షాక్ ఇచ్చారు. ఈ విజయం వెనుక శ్రీకాంత్ ప్రణాళికలు బాగా పని చేశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కంచర్ల ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటి నుంచి పార్టీ నేతలతోపాటు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ రాజకీయ నిలదొక్కుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు కుప్పం బాధ్యతలను శ్రీకాంత్ కు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కమిటీ తోడుగా..
ఇటీవల వైసీపీ చేతిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తల్ని కంచర్ల శ్రీకాంత్ పరామర్శించి ధైర్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు లక్ష మెజారిటీ తీసుకొచ్చేందుకు శ్రీకాంత్ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. కుప్పంలో తరచూ పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా కుప్పం బాధ్యతల్ని అప్పగించడంతో అక్కడే తిష్ట వేయడానికి శ్రీకాంత్ సన్నద్ధమయ్యారు. దీంతోపాటు కుప్పంలో 38 మంది టీడీపీ సభ్యులతో కూడిన కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా శ్రీకాంత్ తో కలిసి చంద్రబాబుకు అత్యధిక మెజారిటీ వచ్చేందుకు కృషి చేయనుంది.
- Tags
- Kuppam TDP