- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రశీదుపై మతపరమైన కీర్తనలు.. విశాఖ ట్రాఫిక్ పోలీసుల క్లారిటీ ఇదే
దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖపట్నం ట్రాఫిక్ పోలీసులు వివాదంలో ఇరుక్కున్నారు. ప్రీపెయిడ్ ఆటోస్టాండ్‌లో ప్రయాణికులకు ఇచ్చే టోకెన్లపై బైబిల్ వాక్యాలు ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విశాఖ పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే టోకెన్లు నిలిపివేయాలని ఆదేశించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వివరణ ఇచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ రైల్వే స్టేషన్‌లో ట్రాఫిక్ పోలీసు నిర్వహించే ప్రీపెయిడ్ ఆటోస్టాండ్‌లో ఇచ్చే ప్రయాణికులకు ఇచ్చే టోకెన్లపై ఒక మతానికి సంబంధించిన కీర్తనలు ఉండటం వివాదానికి దారి తీశాయి. వాతస్వానికి ప్రీపెయిడ్ ఆటోస్టాండ్‌లో ప్రయాణికులకు ఇచ్చే టోకెన్లు అయిపోయాయి. అయితే కొత్త టోకెన్లు తీసుకురావాలని ప్రీపెయిడ్ ఆటో సెక్రటరీకి అక్కడి సిబ్బంది చెప్పడంతో.. అతడు బైబిల్ వాక్యాలతో కూడిన టోకెన్లను తీసుకువచ్చారని పోలీస్ శాఖ వివరణ ఇచ్చింది. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అవి గమనించకుండా పంపిణీ చేసినట్లు చెప్పుకొచ్చారు. మరోవైపు విశాఖ పోలీస్ శాఖ సోషల్ మీడియాలో కూడా వివరణ ఇచ్చింది. 'ఓ ఆటోడ్రైవర్ తన అజ్ఞానంతో దురదృష్టవశాత్తు హెడ్ కానిస్టేబుల్‌కు అందజేసిన స్లిప్పులను అత్యవసర పరిస్థితుల్లో పంపిణీ చేశాడు. దృష్టికి వచ్చిన వెంటనే నిలిపివేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదు'అని వివరణ ఇచ్చింది.
- Tags
- vizag
- Telugunews