- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కేసులో చంద్రబాబుకు ఊరట: అరెస్ట్ చేయబోమన్న సీఐడీ
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణ వాయిదా పడింది. ఈనెల 22కు విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఇదే సమయంలో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్న నేపథ్యంలో బెయిల్ గడువు పూర్తయ్యే వరకు ఎలాంటి అరెస్ట్ చేయబోమని సీఐడీ కోర్టుకు తెలియజేసింది. ఏపీ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. తొలుత విచారణ చేపట్టిన హైకోర్టు కాస్త విరామం తీసుకుంది. అనంతరం మళ్లీ విచారణ చేపట్టింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయాన్ని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో అరెస్ట్ చేయడం ఆయన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించడమేనని కోర్టులో వాదించారు. అయితే చంద్రబాబు నాయుడును ఐఆర్ఆర్ కేసులో అరెస్ట్ చేయబోమని ఏజీ శ్రీరాం సుబ్రహ్మణ్యం వెల్లడించారు. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్నారన్న విషయం తమకు తెలుసునన్నారు. మధ్యంతర బెయిల్‌పై ఉన్నందన అరెస్ట్ చేయబోమని ప్రకటించారు. మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల స్ఫూర్తిని పాటిస్తామని ఏజీ శ్రీరాం సుబ్రహ్మణ్యం తెలిపారు. మధ్యంతర బెయిల్ గడువు పూర్తయ్యే వరకు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయబోం అని ఏజీ శ్రీరాం సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలియజేశారు. దీంతో ఇరువాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.
స్వల్పఊరట
తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న సమయంలో మరికొన్ని కేసులు తెరపైకి వచ్చాయి. ఏపీ సీఐడీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసును తెరపైకి తీసుకువచ్చింది. అలాగే అంగళ్లు కేసు కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు అంగళ్లు కేసులో చంద్రబాబును అక్టోబర్ 12 , ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అక్టోబర్ 16 వరకూ అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడు స్వల్ప ఊరట లభించినట్లైంది. అనంతరం అక్టోబర్ 12న మళ్లీ ఈ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు నాయుడును నవంబర్ 7 వరకు అరెస్ట్ చేయెుద్దని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై విచారణ దశలో ఉన్న పీటీ వారెంట్ పై కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది. ఇప్పటి వరకు ఉన్న ఆదేశాలు తదుపరి విచారణ వరకు అమలులో ఉంటాయని తెలిపింది. దీంతో ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.
ప్రధాన నిందితుడిగా చంద్రబాబు
ఇకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ14గా నారా లోకేశ్ ను కూడా చేర్చింది. మాజీ మంత్రి నారాయణ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుతో పాటు ఐఆర్ఆర్, ఫైబర్ నెట్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబును విచారణకు సీఐడీ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు కోర్టుల్లో పోరాటం చేస్తుండగా ఐఆర్ఆర్, అంగళ్లు కేసులో స్వల్ప ఊరట లభించింది. ఏపీ ఫైబర్ నెట్ కేసుపై విచారణ కొనసాగుతుంది.