- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఏపీలో మద్యం స్కాం.. కేంద్రహోంమంత్రికి పురంధేశ్వరి ఫిర్యాదు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జరుగుతున్న మద్యం కుంభకోణంపై కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మద్యంపై వస్తున్న ఆదాయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కుంభకోణానికి పాల్పడుతోందని...అటు ప్రజల ప్రాణాలతో సైతం చెలగాటమాడుతోందని పలుమార్లు ఆమె నిరసన వ్యక్తం చేశారు. అలాగే కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఆమె హెచ్చరించినట్లుగానే తాజాగా కేంద్రహోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన పురంధేశ్వరి నేరుగా వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీలో జరుగుతున్న మద్యం కుంభకోణంపై అమిత్ షాకు ఆమె ఫిర్యాదు చేశారు. సీబీఐతో విచారణ జరపాలని కోరారు. అటు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సైతం అమిత్ షా దృష్టికి ఆమె తీసుకెళ్లారు. బీజేపీ కోర్ కమిటీ వివరాలను కూడా అమిత్ షాకు వివరించారు. మరోవైపు పొత్తులపైనా చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు అరెస్ట్, బీజేపీపై జరుగుతున్న ప్రచారం, పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంపైనా ఢిల్లీ నాయకత్వానికి పురంధేశ్వరి తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం సైతం అక్కడే ఉండి పొత్తులపై తాడో పేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ పెద్దలకు ఆమె చెబుతారని తెలుస్తోంది.