పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద..పులివర్తి నాని నిరసన?

by Disha Web Desk 18 |
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద..పులివర్తి నాని నిరసన?
X

దిశ,చంద్రగిరి:సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైన విషయం విధితమే. చంద్రగిరి నియోజకవర్గం ఓటర్లకు తిరుపతి లోని మహిళా యూనివర్సిటీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సందర్శించి అక్కడ సదుపాయాలు లేవని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ మహిళా ఓటర్లు కు సరైన సదుపాయాలు కల్పించకపోవడం దారుణమని అన్నారు. హెల్ప్ డెస్క్ లు ఎక్కువగా లేకపోవడంతో ఓటర్లలో గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. భరించలేని ఉక్కపోత కు ఓటర్లు అల్లాడుతున్నారని సరైన వసతులు కల్పించాలని పులివర్తి నాని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి ఓబీసీ ఫోరం అధ్యక్షుడు బడి సుధా యాదవ్ టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed