YCP Class War: నడిరోడ్డుపై కోట్లాట..మాదాసి అనుచరుడికి గాయాలు

by srinivas |   ( Updated:2023-07-02 10:08:59.0  )
YCP Class War: నడిరోడ్డుపై కోట్లాట..మాదాసి అనుచరుడికి గాయాలు
X

దిశ,డైనమిక్ బ్యూరో: ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది. నియోజకవర్గంలో ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు, పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ మాదాసి వెంకయ్య వర్గాలు ఇప్పటి వరకు విమర్శలతో సరిపెట్టుకున్నారు. కానీ ఆదివారం ఏకంగా నడిరోడ్డుపై కొట్టుకున్నారు. ఈ ఘటన టంగుటూరు జాతీయ రహదారిపై జరిగింది. ఓటీ దుకాణంలో పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య ఆయన అనుచరులు టీ తాగుతున్నారు. అయితే అశోక్‌బాబు తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు వెంకయ్య ఆయన వర్గం అక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు.

అయితే అశోక్ బాబు వర్గీయులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. ఈ దాడిలో మాదాసి వెంకయ్య అనుచరుడు సాయి గాయపడ్డాడు. దీంతో ఆయనను ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఒంగోలు రిమ్స్‌లో సాయి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది.

Advertisement

Next Story