- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
16న టీడీపీలోకి ఒంగోలు ఎంపీ.. కుమారుడితో కలిసి చేరిక
దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 16న తెలుగుదేశం పార్టీలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి చేరనున్నారు. ఆయనతో పాటు కుమారుడు రాఘవరెడ్డి సైతం సైకిల్ ఎక్కబోతున్నారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే ఈసారి ఆయనకు సీఎం జగన్ సీటు నిరాకరించారు. దీంతో కొంతకాలంగా వైసీపీకి మాగుంట దూరంగా ఉన్నారు. మాగుంటను వైసీపీలోనే ఉంచేందుకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు చాలా ప్రయత్నం చేశారు. అయినా సరే వైసీపీకి మాగుంట గుడ్ బై చెప్పక తప్పలేదు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించిన ఆయన చివరకు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన టీడీపీ ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుటుంబానికి లిక్కర్ వ్యాపారులున్నాయి. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇటీవల అప్రూవర్‌గా మారారు.
Read More..