- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mutyala Reddy: పోలీసుల నుంచి ప్రాణ హాని ఉంది.. రక్షించండి!
దిశ, దక్షిణ కోస్తా: ఎక్కడైనా బయట వ్యక్తుల నుంచి ప్రాణ హాని ఉందని భావిస్తే పోలీసులను ఆశ్రయిస్తారు. ఇక్కడ పోలీసుల నుంచి తనకు ప్రాణ భయం ఉందంటూ ఓ వ్యక్తి ఏకంగా ‘జగనన్నకు చెబుదాం’కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో వెలుగు చూసింది.
సూరిబోయిన ముత్యాల రెడ్డికి పూర్వీకుల నుంచి సంక్రమించిన 12 సెంట్లు ఇంటి స్థలం ఉంది. దీనిపై ఇరుగు పొరుగుతో వివాదం నడుస్తోంది. సమస్యను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. ఈనెల 26న ఏఎస్సైతోపాటు మరికొందరు కానిస్టేబుల్స్కనపర్తి వెళ్లారు. ముత్యాలరెడ్డి స్థలం హద్దు రాళ్లు, ఫెన్సింగ్పీకేశారు. అడ్డు పడిన కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషిస్తూ నెట్టేశారు. ముత్యాలరెడ్డి హార్ట్ పేషెంటు. ఈ హఠాత్పరిణామానికి కోలుకోలేకపోయాడు. మళ్లీ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగావంటే గంజాయి కేసు పెట్టి జైల్లోనే మగ్గేట్లు చేస్తానని బెదిరించారు. అక్కడ పోలీసులు చేసిన బీభత్సాన్ని వీడియో తీసినందుకు ముత్యాలరెడ్డి కుటుంబ సభ్యుల నుంచి మొబైల్స్లాక్కున్నారు. వీడియోలు డిలిట్చేసి తర్వాత తిరిగిచ్చేశారు. స్థల వివాదాన్ని రెవెన్యూ అధికారులు పరిష్కరించాలి. దీనికి భిన్నంగా పోలీసులు ఎలా జోక్యం చేసుకుంటారంటూ గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. పోలీసుల నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ ముత్యాలరెడ్డి ‘జగనన్నకు చెబుదాం’కు టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేశారు.