Prakasam: పొలాల్లో భయంకరమైన సీన్.. బెదిరిపోయిన రైతులు

by srinivas |
Prakasam: పొలాల్లో భయంకరమైన సీన్.. బెదిరిపోయిన రైతులు
X

దిశ, ఎర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలం గుట్ల ఉమ్మడివరం వద్ద రైతులు జామాయిల్ సాగు చేస్తున్నారు. అయితే పొలాల్లో సుమారు 18 అడుగుల కొండ చిలువ కనిపించింది. కుక్కను చంపి శరీరాన్ని నలిపివేస్తుండగా రైతులకు ఎముకలు విరిగిన శబ్దం వినిపించింది. దీంతో ఎక్కడి నుంచి వస్తుందని చూడటంతో భారీ కొండచిలువ కుక్కను చుట్టుకుని మింగుతూ కనిపించింది.


ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన రైతులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటన స్థలానికి వచ్చిన మల్లికార్జున చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.


Next Story

Most Viewed