- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Markapur: కొత్త కాన్సెప్ట్‌కు చంద్రబాబు శ్రీకారం.. ఇది జరిగితే అద్భుతమేనట
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టీడీపీ శ్రేణులు ఆ పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురంలో తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి వారికి తినిపించారు.
కొత్త కాన్సెప్ట్‌కు శ్రీకారం
ఈ సందర్భంగా చంద్రబాబు ఐడియాలజీ అనే కాన్సెప్ట్‌ను విడుదల చేశారు. పేదలను కోటీశ్వరులను చేయడమే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా నెం.1 జాతిగా నిలవాలన్నదే తన సంకల్పమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రెండు సంకల్పాలపై తాను దృష్టి సారించినట్లు చెప్పారు. గతంలో జన్మభూమి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా పని చేసి ప్రజల జీవితాలను మారుద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. కోటీశ్వరులు తోటి వారికి మెంటర్‌గా నిలవాలని, సాయం చేసి వారి పేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలన్నారు. ఆర్థిక, అసమానతలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని చంద్రబాబు కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. టెక్నాలజీ ద్వారా కుటుంబాలను యూనిట్‌గా తీసుకుని ప్రజల జీవితాల్లో మార్పు తెస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.