Viral Fever: భయపడవద్దు.. సాధారణ జ్వరాలే

by srinivas |
Viral Fever: భయపడవద్దు.. సాధారణ జ్వరాలే
X

దిశ, ఎర్రగొండపాలెం: వాతావరణం మార్పుల వల్లే ప్రజలకు సాధారణ జ్వరాలు వస్తున్నాయని ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాత్రి సమయంలో చలిగా ఉంటుందని, పగటిపూట వేడి తీవ్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇలా వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉన్న ప్రక్రియలో సీజనల్ వైరల్ ఫీవర్ జ్వరం వస్తుందని తెలిపారు.


ఇది ఏమీ ప్రమాదకరమైంది కాదని వెల్లడించారు. భయపడాల్సిన అవసరమే లేదని, మరిగిన వేడి నీటిని చల్లార్చి తాగితే మంచిదని తెలిపారు. ప్రజలు గుంపుగా ఉన్నప్పుడు మాస్కు ధరించాలని సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలని తెలిపారు. నిత్యం వాడే సాధారణమైన వస్తువులు, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చుట్టా, బీడీ, కైనీ గుట్కా లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

కాగా జ్వరాలో ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల బాట పడుతున్నారు. రోజు రోజుకు ఎర్రగొండపాలెం ప్రభుత్వానికి రోగుల తాకిడి తాకుతోంది. వారం రోజులు అవుతున్నా జ్వరాలు తగ్గడం లేదు. దీంతో జ్వరాలపై రోగులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
Next Story

Most Viewed