మళ్లీ పొత్తు వైపు టీడీపీ, జనసేన, బీజేపీ.. సంక్రాంతికి ముహూర్తం..?

by srinivas |   ( Updated:2023-12-29 11:43:42.0  )
మళ్లీ పొత్తు వైపు టీడీపీ, జనసేన, బీజేపీ.. సంక్రాంతికి ముహూర్తం..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2014లో మాదిరిగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి తర్వాత ఈ మూడు పార్టీలు ఒక్కటి కానున్నాయని, ఇందుకు సంబంధించిన ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ముగ్గురు జాతీయ నేతలకు పొత్తు పంచాయితీని అప్పగించారని, ఇప్పటికే నేతల అభిప్రాయాన్ని సైతం సేకరించారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాద పొత్తు వల్ల లాభమా, నష్టామా అనేది కూడా అంచనా వేశారని, ఇప్పుడు ఈ నివేదికను ప్రధాని మోదీ టేబుల్ వద్దకు చేరిందని తెలుస్తోంది. అటు పార్లమెంటరీ బోర్డులోనూ పొత్తులపై చర్చించి బీజేపీ అధిష్టానం తుది నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.

అయితే పొత్తులో భాగంగా 12 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలు బీజేపీ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ షరతులు ఓకే అయితే టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఖరారు అయినట్లేనని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు జనవరి మొదటి వారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్తారని.. బీజేపీ అధిష్టానంతో మాట్లాడతారని సమాచారం. మొత్తానికి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై సంక్రాంతి తర్వాత పొత్తులపై ఓక్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. ఇదే నిజమైతే 2014 రాజకీయం ఏపీలో రిపీట్ కాబోతుందోందని తెలుస్తోంది. మరోవైపు మెజార్టీ నేతలు, కార్యకర్తలు టీడీపీ, జనసేన పొత్తును ప్రతిపాదించారని సమచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed