- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే లాభం లేదని ఆ పని చేస్తున్న పెద్దారెడ్డి..
దిశ వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి. అవకాశం దొరికితే చాలు అధికారపక్షానికి, విపక్షాలకు మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా నేతలు ఒకరిపై మరొకరు విమర్శల అస్త్రాలను సంధించుకుంటున్నారు. తాజాగా టీడీపీ వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎద్దేవ చేస్తూ ట్వీట్ చేసింది.
పెద్దిరెడ్డికి పుంగనూరులో గెలవనని అర్ధమైపోయిందని.. దీనితో రానున్న ఎన్నికల గురించి భయం పట్టుకుందని పేర్కొంది. జగన్ ని నమ్ముకుంటే లాభం లేదని గ్రహించిన పెద్దిరెడ్డి చివరాఖరికి పుంగనూరులో ముప్పై రూపాయల చీరలు పంచిపెడుతున్నాడని ఎద్దేవ చేసింది. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో, వార్డు సచివాలయంలో పెట్టి మరీ పెద్దిరెడ్డి చీరలు పంచుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని పోస్ట్ లో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కాగా టీడీపీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
పెద్దిరెడ్డికి పుంగనూరులో గెలవనని అర్ధమైపోయింది. భయం పట్టుకుంది.
— Telugu Desam Party (@JaiTDP) March 14, 2024
జగన్ ని నమ్ముకుంటే లాభం లేదని, చివరాఖరికి పుంగనూరులో ముప్పై రూపాయల చీరలు పంచిపెడుతున్నాడు పెద్దిరెడ్డి.
వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో, వార్డు సచివాలయంలో పెట్టి మరీ పంచుతుంటే, అధికారులు చోద్యం చూస్తున్నారు.… pic.twitter.com/bDM5UGGaoj