- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పవన్ వారసుడు అకీరా.. అటు రాజకీయాల్లోనూ..?

దిశ, డైనమిక్‌బ్యూరో : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆయన కుమారుడు అకీరా నందన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ప్రతి సందర్భంలోనూ ఆయన అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఆలయాల సందర్శనలో భాగంగా వీరిద్దరూ అగస్త్య మహర్షి ఆలయంలో పూజలు చేస్తున్న చిత్రాన్ని జనసేన మహిళా విభాగం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన లో భాగంగా ఈ రోజు కేరళలోని కొచ్చి సమీపాన ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. వీరి వెంట టీటీడీ పాలక మండలి సభ్యులు ఆనందసాయి ఉన్నారు. ఇది చూసిన వారు సినిమాల్లో మాత్రమే కాదు.. రాజకీయాల్లో కూడా అకీరానందన్‌ను వారసుడిగా తీసుకు వస్తారా.. అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. గతంలో ప్రధాని మోదీని కలవడానికి వెళ్లినప్పుడు కూడా అకీరాను పవన్ వెంట తీసుకు వెళ్లాడు. ఈ మధ్య కాశీలో అకీరా ఫొటోలు వైరల్ అయ్యాయి. కారణం అతను కాషాయ డ్రెస్ ధరించి ఉండడం కూడా..! ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా పలు ఆలయాలను దర్శించుకుంటున్న సమయంలో ప్రత్యేక వస్త్రధారణతో వెళ్లారు. మరో వైపు ఓజీ సినిమాలో కూడా అకీరాకు ఓ పాత్ర ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మార్షల్ఆర్ట్ శిక్షణ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. పవన్కల్యాణ్సినిమాల్లోకి రాకముందు మార్షల్ఆర్ట్స్శిక్షణ పొందారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి పూజలు నిర్వహిస్తున్న ఫొటోను జనసేన వీర మహిళ విభాగం ట్విట్టర్లో పోస్టు చేసింది. అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనే సేమ్‌టూ సేట్అంటూ అభిమానులు మురిసిపోతున్నారు.