పవన్ కళ్యాణ్ ఆఫీస్ చుట్టూ తిరిగి అలసిపోయాం.. విషం తాగిన తల్లీకూతుళ్లు!

by Jakkula Mamatha |   ( Updated:2025-03-01 13:39:35.0  )
పవన్ కళ్యాణ్ ఆఫీస్ చుట్టూ తిరిగి అలసిపోయాం.. విషం తాగిన తల్లీకూతుళ్లు!
X

దిశ,వెబ్‌డెస్క్: విజయవాడ(Vijayawada)లో ఓ మహిళ తన కూతురితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. న్యాయం కోసం సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), జనసేన ఆఫీసు(Janasena)ల చుట్టూ తిరిగి అలసిపోయామంటూ విజయవాడలో తల్లీకూతుళ్లు విషం తాగారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే.. విజయవాడ వాంబే కాలనీకి చెందిన ఓ మహిళ తన ఆవేదనను సెల్ఫీ రూపంలో తెలియజేసింది. ‘‘నా పేరు సుభాషిణి, కూతురి పేరు హాసిని. నిత్యం నా భర్త నాగరాజు, కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారనుకున్నాం. కానీ ప్రయోజనం లేదు. ఇప్పుడు నా బిడ్డ, నేను విషం తీసుకుని చనిపోతున్నామంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు’’ ఈ మేరకు ఆమె సెల్ఫీ వీడియో(Selfie Video) రిలీజ్ చేశారు.

Next Story