పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా: MP GVL Narasimharao

by Satheesh |   ( Updated:2022-11-27 11:25:42.0  )
పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా: MP GVL Narasimharao
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికార వైసీపీపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కుటుంబ, వంశ రాజకీయాలకు వ్యతిరేకంగా పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు జీవిఎల్ తెలిపారు. ప్రభుత్వ పథకాల పేర్లను సొంత డబ్బా కోసం 'జగనన్న' పేరుతో ప్రచారం చేసుకోవటం తప్పని జీవిఎల్ విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ తప్పుడు సంస్కృతిని అవలంబించే వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయమయిన బీజేపీ-జనసేన నుంచే విముక్తి సాధ్యమని అన్నారు. కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల కూల్చివేత బాధితులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి : వెళ్లి ఆయన చెవిలో చెప్పు.. Pawanపై పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed